- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీ పాలనలో దేశం రెండింతలు అభివృద్ది : బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో అనేక తప్పులు ఉన్నాయని, 51 శాతం ఉన్న బీసీ జనాభాను తగ్గినట్లు, మైనారిటీలను బీసీలుగా చూపించడం కుట్రేనని ఎమ్మెల్యే ధనపాల్సూర్యనారాయణ గుప్తా విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో అనేక తప్పులు ఉన్నాయని, 51 శాతం ఉన్న బీసీ జనాభాను తగ్గినట్లు, మైనారిటీలను బీసీలుగా చూపించడం కుట్రేనని ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా విమర్శించారు. ఈ కులగణన సరైనది కాదని అసెంబ్లీలో కూడా నిలదీశామని, మోడీ 11 ఏళ్ల పాలనలో దేశంలోని అన్ని రంగాల్లో రెండింతలు అభివృద్ధి కనిపిస్తోందన్నారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం నిజామాబాద్ రైతుల 40 ఏళ్ల కల అయిన పసుపు బోర్డు స్థాపన చేసిందని, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, జాతీయ రహదారుల నిర్మాణం, బీబీనగర్ ఎయిమ్స్, రామగుండం ఎరువుల పరిశ్రమ పున:ప్రారంభం వంటి అనేక ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. వందలాది మంది ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నీళ్లు, నిధులు, నియామకాలు మనకే వస్తాయంటూ ఉద్యమం చేశాం.
కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల బీఆర్‌ఎస్ పరిపాలన అవినీతిమయం, అహంకారమయంగా కొనసాగింది. మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్‌కూడా వారి బాటలో కొనసాగుతుందని, ఆరు గ్యారంటీల అమలు చేయకుండా తప్పించుకుంటుందన్నారు. మహాలక్ష్మి స్కీమ్‌లో ఉచిత బస్సు ఒక్కటే అమలు చేస్తున్నారని, ఆ బస్సుల్లోనూ పెద్ద స్కాం జరుగుతోంది. వందల కోట్ల అప్పు కార్పొరేషన్‌పై పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రిక్ బస్సుల్ని తమదని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసినట్లే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అదే మోసం చేస్తోందన్నారు. గతంలో అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌ను కమిషన్ల ప్రభుత్వం అని విమర్శించారు. లక్ష కోట్ల కాళేశ్వరం స్కాం అన్న మాటలు చెప్పారు. ఇప్పుడు అదేదారిలో నడుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.






