- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్థానిక’ పోరుకు మోగిన నగారా.. ఎన్నికల షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నరాగా మోగింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు నరాగా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఏసీ గార్డ్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని మాట్లాడుతూ.. అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 31 జిల్లాల్లో 565 మండలాల్లో రెండు విడతల్లో 5,749 ఎంపీటీసీ, 656 జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై.. నవంబర్ 9తో ముగుస్తుందని తెలిపారు. ఈ క్షణం నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలను విడతల వారీగా నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు, పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ పోలింగ్ రోజు సాయంత్రమే వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు.






