కేంద్ర ప్రభుత్వం పేదల పొట్ట కొడుతోంది : మంత్రి సీతక్క

by Muthe.Rajitha |

కేంద్ర ప్రభుత్వం MGNREGA పథకం పేరు మార్పులను తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా తప్పుబట్టారు.

కేంద్ర ప్రభుత్వం పేదల పొట్ట కొడుతోంది : మంత్రి సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం MGNREGA పథకం పేరు మార్పులను తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా తప్పుబట్టారు. పేదల పొట్టకొట్టడమే కేంద్ర లక్ష్యమని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందని అన్నారు. గాంధీ పేరును పథకం నుంచి తొలగించడం దుర్మార్గమని విమర్శించారు. కొత్తగా ప్రతిపాదించిన బిల్లులో MGNREGAను రద్దు చేసి మరో పేరుతో పథకం తెచ్చే ఆలోచన ఉందని, పనిదినాలు పెంచుతున్నట్టు చెప్పినా నిధుల భారం మాత్రం రాష్ట్రాలపై 40 శాతం మోపుతున్నారని తెలిపారు.

ప్రస్తుతం కేంద్రం భరించే ఖర్చును తగ్గించి రాష్ట్రాలపై అదనపు భారం వేయడం అన్యాయమని, దీంతో పేదలకు హక్కుగా లభించే పని అవకాశాలు బలహీనపడతాయని అన్నారు. కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించినా, విధాన మార్పులతో పథకం అసలు ఉద్దేశమే దెబ్బతింటోందని సీతక్క స్పష్టం చేశారు.

Next Story