- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Daggubati Purandeswari : ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది : దగ్గుబాటి పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి(AP Development)కు కేంద్ర ప్రభుత్వం(Central Government)కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ(BJP) అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari )స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన పురందేశ్వరీ ఏపీకి కొన్ని నెలల్లోనే 3లక్షల కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చాయని వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి(AP Development)కు కేంద్ర ప్రభుత్వం(Central Government)కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ(BJP) అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari )స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన పురందేశ్వరీ ఏపీకి కొన్ని నెలల్లోనే 3లక్షల కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చాయని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంటును లాభాలతో నడిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. దానికి కట్టుబడే కేంద్ర మంత్రి కుమార స్వామి 11,440కోట్ల రూపాయాలు విశాఖ స్టీల్ ప్లాంటుకు కేటాయించారన్నారు.
కొన్ని చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటికి ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రికి వివరించి పరిష్కరించుకుంటు ముందుకెలుతున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గడిచిన ఐదేళ్లలో చిటికెడు మట్టి తీయలేదని..ఇప్పుడు 12,500కోట్ల రూపాయలు కేటాయించారని..కొత్త డయాఫ్రంవాల్ ను 950కోట్లతో నిర్మిస్తుందని తెలిపారు. ఏపీకి జీవధారయైన పోలవరం పూర్తికి కేంద్రం ముందుకెలుతుందన్నారు. నిన్న మొన్నటి వరకు మూడు ముక్కలాట అన్నట్లుగా ఉన్న రాజధాని పరిస్థితిని మారుస్తూ అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని బీజేపీ ముందు నుంచి చెబుతోందన్నారు.
గడిచిన ఐదేళ్లలో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని పురందేశ్వరీ విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఈ ఏడాదే 15 వేల కోట్లు కేంద్రం అందిస్తుందన్నారు. అమరావతి రాజధాని నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 48,012.67 కోట్ల విలువతో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వటం జరిగిందని, అందులో రూ. 14,874.53 కోట్ల విలువైన పనులకు టెండర్లను ఆహ్వానించినట్టు తెలిపారు.






