- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రానికి యూరియా సరఫరాలో కేంద్రం విఫలం
రాష్ట్రానికి సరిపడా యూరియాను సకాలంలో అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి సరిపడా యూరియాను సకాలంలో అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి ఆరోపించారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆందోళనలు చేస్తున్న రైతులకు భరోసా ఇస్తూ బాధ్యత వహించాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిర్లక్ష్యం చేయడం శోచనీయమన్నారు. వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా యూరియాను సకాలంలో సరఫరా చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణకు యూరియా సరఫరాపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందనీ, రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటాను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పంటలకు సరైన సమయంలో యూరియా వేయకపోతే పంటల దిగుబడి తగ్గి ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. రైతుల వ్యవసాయ పంటల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల వెంటనే కేంద్ర ప్రభుత్వంపై మరింతగా ఒత్తిడిని పెంచి రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా తగు చర్యలు తీసుకొవాలని కోరారు.






