- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జస్ట్ మిస్.. తాళికట్టే లోపే పెళ్లి పీటల నుంచి లేచిపోయిన వధువు
నేటి జనరేషన్ అన్ని విషయాల్లో చాలా స్పష్టంగా ఉంటున్నారు. తల్లిదండ్రులు తిడతారని.. బంధువులు ఏదో అనుకుంటారని,.. ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారని.. ఇలా దేనికి భయపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్/కొత్తకోట : నేటి జనరేషన్ అన్ని విషయాల్లో చాలా స్పష్టంగా ఉంటున్నారు. తల్లిదండ్రులు తిడతారని.. బంధువులు ఏదో అనుకుంటారని,.. ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారని.. ఇలా దేనికి భయపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మొదట కొంత అభాసుపాలైనా.. ఫ్యూచర్‌కు మాత్రం బంగారు బాటలే వేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి నిర్ణయమే తీసుకోని ఓ యువతి సంచలనం సృష్టించింది. మంచా.. చెడా అని ఆలోచించకుండా పచ్చటి పందిరిలో తన డెసిషన్‌ను కుండబద్దలు కొట్టింది. వరుడు తనకు నచ్చలేదని.. బలవంతంగా చేసే పెళ్లి తాను చేసుకోనని ఖరాఖండిగా చెప్పేసింది. వనపర్తిలో వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన యువతి(20)కి కొత్తకోట పట్టణానికి చెందిన యువకుడి (23)తో పెళ్లి నిశ్చయమైంది. గురువారం ఉదయం 7 గంటలకు వీరి వివాహాన్ని శ్రీదత్త కోటిలింగేశ్వర ఆలయంలో నిర్వహించేందుకు బంధుమిత్రులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇరుకుటుంబ సభ్యులు హాజరై పెళ్లితంతును ప్రారంభించారు. అయితే యువకుడు తనకు నచ్చలేదని.. తను ఈ పెళ్లి చేసుకోనని వధువు తల్లిదండ్రులకు చెప్పింది. అయినా కుటుంబ సభ్యులు ఆమెకు బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు. అందంగా ముస్తాబు చేసి పెళ్లి మండపం పైకి తీసుకెళ్లారు. ఇక వేదమంత్రాల సాక్షిగా వరుడు లేచి అమ్మాయి మెడలో తాళి కట్టడానికి లేవగాని వధువు అతడిని తోసేసి అక్కడి నుంచి పరుగు తీసింది. బంధువులు ఆమెను అడ్డగించి బుజ్జగించినా పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేసింది. పెళ్లి ఎందుకు చేసుకోవని యువతిని గట్టిగా నిలదీయడంతో వరుడికి ‘నత్తి’ ఉందని, అతడికి స్పష్టంగా మాట్లాడటం రావడం లేదని చెప్పింది. దీంతో వివాహానికి హాజరైన బంధుమిత్రులు సైతం ఆమెను ఏమి అనలేక పెళ్లిని రద్దు చేసుకోని వెళ్లిపోయారు.






