హైదరాబాద్‌లో పని మనుషులపై వివక్ష.. డబ్బున్నోళ్ల లిఫ్ట్ వాడితే భారీగా ఫైన్

by Bhoopathi Nagaiah |

ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు అభివృద్ధి చెందినా కొందరి బుద్ది మారడం లేదు. ఇంకా కులం, మతం, పేద, ధనిక అంటూ వివక్ష చూపుతూనే ఉన్నారు.

హైదరాబాద్‌లో పని మనుషులపై వివక్ష.. డబ్బున్నోళ్ల లిఫ్ట్ వాడితే భారీగా ఫైన్
X

వెబ్‌డెస్క్: ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు అభివృద్ధి చెందినా కొందరి బుద్ది మారడం లేదు. ఇంకా కులం, మతం, పేద, ధనిక అంటూ వివక్ష చూపుతూనే ఉన్నారు. ఇది ఎక్కడో మారుమూల పల్లెలు అనుకుంటే పొరపాటే. మినీ భారత్‌గా పేరొందిన ప్రపంచ దిగ్గజ నగరం హైదరాబాద్‌లోనే. అది కూడా ఏదో స్లమ్ ఏరియా కాదు.. ఉన్నత విద్యావంతులు ఉన్న హైటెక్ సిటీ ప్రాంతంలో కావడం విచారించతగ్గ విషయం. ఇళ్లలో పని చేసే వాళ్లు ఈ లిఫ్ట్ వాడకూడదని.. ఉపయోగిస్తే జరిమానా విధిస్తామని బోర్డు పెట్టి తన హీనబుద్ధిని ప్రదర్శించుకున్నారు ఓ అపార్ట్ మెంట్ నిర్వహకులు.

హైటెక్ సిటీ ప్రాంతంలోని ఓ రిచ్ కాలనీలోని అపార్ట్‌మెంట్‌కు రెండు లిఫ్ట్‌లు ఉన్నాయి. దానిలో ఒకటి ఫ్లాట్ ఓనర్స్‌కు మరొకటి పని మనుషులకు. ఇళ్లలో పని చేసే వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఓనర్స్ ఉపయోగించే లిఫ్ట్‌ను ముట్టుకోకూడదు.. యూజ్ చేయకూడదు. ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే వారికి రూ.1000 జరిమానా విధిస్తామని ఓనర్లు ఆ లిఫ్ట్ గోడకు ఓ హెచ్చరిక బోర్డును సైతం పెట్టారు. దీనిని ఓ వ్యక్తి ఫొటో తీసి ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఈ పోస్ట్‌పై నెటిజన్స్ తీవ్రంగా స్పందించారు. 21వ శాతాబ్దంలో కూడా ఇలాంటి హీనబుద్ది కాలవారు ఉన్నారా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ అపార్ట్‌మెంట్ ఓనర్స్‌ను తిట్టిపోస్తున్నారు.

Next Story