- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీల్స్ తెరుచుకోక గంటకు పైగా గాల్లోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం చక్కర్లు
సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టడం కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో:సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వద్ద గాల్లోనే చక్కర్లు కొట్టి చివరకు అక్కడే సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. ఆ సమయంలో ఫ్లయిట్ లో పైలట్లు సహా మొత్తం 12 మంది ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానంలో హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాలేదు. ఎంత ప్రయత్నించినా వీల్స్ ఓపెన్ కాకపోవడంతో టెన్షన్ నెలకొంది. దీంతో గంటకుపైగా బేగంపేట విమానాశ్రయం వద్ద ఆ విమానం గాల్లో చక్కర్లు కొడుతూ సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించింది. హకీంపేట, బేగంపేట్ లో ఏక్కడ ల్యాండింగ్ చేస్తే సేఫ్ అనే దానిపై ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. చివరకు అధికారులు, పైలట్ల ప్రయత్నంతో బేగంపేట విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.






