అందుకే రామమందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ దూరం.. : మల్లు రవి

by Sathputhe Rajesh |   (  Updated:2024-01-15 12:12:18  IST  )

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ దూరంగా ఉండటంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవి క్లారిటీ ఇచ్చారు.

అందుకే రామమందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ దూరం.. : మల్లు రవి
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ దూరంగా ఉండటంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మల్లు రవి క్లారిటీ ఇచ్చారు. రామ మందిరాన్ని బీజేపీ పార్టీ కార్యక్రమంలాగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. రాముడు అందరి వాడని.. కాంగ్రెస్ రామరాజ్యం లక్ష్యంగా పని చేస్తుందన్నారు. గాంధీ, ఇందిరా నుంచి నేటి వరకు కాంగ్రెస్ ఆలోచనా విధానంతో ముందుకెళ్తుందన్నారు. రామ మందిర ఆహ్వానం ఉన్నా ట్రస్ట్‌తో సంబంధం లేకుండా బీజేపీ తన పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తుందనే వెళ్లలేక పోతున్నామన్నారు.

రామ మందిరాన్ని బీజేపీ తన రాజకీయానికి వాడుకుంటుందన్నారు. మణిపూర్ అల్లర్లపై ప్రశ్నిస్తే ప్రతిపక్షాలను సభ నుంచి సస్పెండ్ చేసి బిల్లులను పాస్ చేసుకున్నారన్నారు. దేశాన్ని ఏక తాటిపై తేవడానికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారన్నారు. రాష్ట్రంలో 30 రోజుల పాలన ప్రజారంజకంగా సాగిందన్నారు. పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బృందం ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిందన్నారు.

Next Story