అందుకే కాంగ్రెస్‌ సర్కార్‌తో కలిసి పనిచేస్తున్న.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి (Kaidyam Srihari), మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) మధ్య మాటల యుద్ధ కొనసాగుతోంది.

అందుకే కాంగ్రెస్‌ సర్కార్‌తో కలిసి పనిచేస్తున్న.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి (Kaidyam Srihari), మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) మధ్య మాటల యుద్ధ కొనసాగుతోంది. బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్‌ (Congress)లో చేరిన కడియం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధి కొరకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని స్పష్టం చేశారు.

నియోజకవర్గ పరిధిలో రిజర్వాయర్లు ఉన్నా.. కాలువలు అసంపూర్తిగా చెట్లు, పూడిక పేరుకుపోయని అన్నారు. దీంతో చివరి వరకు సాగు నీరు అందడం లేదన్నారు. ఇదే విషయాన్ని తాను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లి కాలువలకు పూడికలు తీసి సీసీ లైనింగ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పానని అన్నారు. 2023 ఎన్నికల్లో తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచానని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని మాటిచ్చానని తెలిపారు. బీఆర్ఎస్ ఓటమితో నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని భావించి.. కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తే అనుకున్న విధంగా అభివృద్ధి సాధ్యమని నమ్మానని అన్నారు.

Next Story