- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నా శ్వాస ఆగేది అప్పుడే’.. బండి సంజయ్ ఎమోషనల్ కామెంట్స్
ప్రజా సేవకు ముందుకొచ్చే ప్రతి నాయకుడిని తాను ప్రజాప్రతినిధిగా చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా సేవకు ముందుకొచ్చే ప్రతి నాయకుడిని తాను ప్రజాప్రతినిధిగా చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ రోజు కరీంనగర్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి బూత్ కమిటీ అధ్యక్షుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. తాను ప్రతి నాయకుడిని ప్రజాప్రతినిధిగా చేస్తానని హామీ ఇచ్చారు. ఇక ఓటుకు రూ.7 వేలు ఇచ్చి కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిందని అన్నారు. మైనార్టీల ఓట్లను పెద్ద ఎత్తున డబ్బులిచ్చి కొన్నారని ఆరోపించారు. తనను కొందరు హిందుత్వం గురించి మాట్లాడొద్దంటున్నారని, బీజేపీ మూల సిద్ధాంతమే హిందుత్వమని కామెంట్ చేశారు. హిందువుల ఓటు బ్యాంకుతోనే హైదరాబాద్‌లో బీజేపీ బలపడిందని, తాను హిందువుల ఓటు బ్యాంకుతోనే ఎంపీగా గెలిచానన్నారు. “నా నోటి నుంచి హిందుత్వం మాట ఆగిపోతే.. అప్పుడే నా శ్వాస ఆగిపోతుంది” అని బండి సంజయ్ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.






