T.Rajaiah: రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనానికి కడియం శ్రీహరే సూత్రధారి అవుతారు

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) నేత, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

T.Rajaiah: రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనానికి కడియం శ్రీహరే సూత్రధారి అవుతారు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari)ని టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేల్లో అతిపెద్ద మోసగాడు కడియం శ్రీహరి(Kadiyam Srihari)నే అని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి(Kadiyam Srihari) పొగరుతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నమ్మక ద్రోహి, జిత్తులు మారి నక్కగా కడియం శ్రీహరికి పేరుందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కడియం శ్రీహరికి కేటీఆర్‌(KTR) మీద విమర్శలు చేసేంత స్థాయి లేదని అన్నారు. పది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మీద ప్రజల్లో వ్యతిరేక మొదలైందని తెలిపారు. ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. త్వరలో కేటీఆర్(KTR) పాదయాత్ర చేయబోతున్నారని వెల్లడించారు.

కేటీఆర్‌ మీద అసత్య ఆరోపణలు చేస్తున్న కడియం శ్రీహరికి.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అపాయింట్మెంటే దొరకడం లేదని ఎద్దేవా చేశారు. పార్టీలు మారడంలో కడియం శ్రీహరి మెరుపు వీరుడు, ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌(KCR)కు వెన్నుపోటు పొడిచిన వీరుడు కడియం.. రేపు రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి కూడా వెన్నుపోటు పొడుస్తాడని అన్నారు. కేసీఆర్‌కు ఎవరూ చేయని నమ్మకద్రోహం కడియం శ్రీహరి చేశాడని మండిపడ్డారు. మలేషియా, సింగపూర్‌కు హవాలా ద్వారా డబ్బులు పంపించి తన కూతురు, అల్లుడు ద్వారా ఆస్తులు కొనుగోలు చేశారని ఆరోపించారు. 1992లో రాజకీయాలకు వచ్చినప్పుడు నీ ఆస్తి ఎంత ఇప్పుడు మీ ఆస్తి ఎంత అని అడిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనం కావడానికి కడియం శ్రీహరి సూత్రధారిగా అవుతాడని తీవ్ర ఆరోపణలు చేశారు. నమ్మకంతో నిన్ను గెలిపించిన ప్రజలకు మోసం చేసినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు.

Next Story