నూతన సీఎస్ రేసులో ఆ సీనియర్ IAS.. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-06 05:41:21  IST  )

ప్రభుత్వ పాలనా వ్యవహరాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే ప్రధాన కార్యదర్శి పోస్టుపై అటు ఉద్యోగులు, అధికార పార్టీ నేతల్లో అప్పుడే చర్చ మొదలైంది.

నూతన సీఎస్ రేసులో ఆ సీనియర్ IAS.. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
X

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రభుత్వ పాలనా వ్యవహరాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే ప్రధాన కార్యదర్శి పోస్టుపై అటు ఉద్యోగులు, అధికార పార్టీ నేతల్లో అప్పుడే చర్చ మొదలైంది. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా (CS)గా ఉన్న రామకృష్ణా రావు (Ramakrishna Rao) ఈనెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ, ప్రభుత్వానికి ఆయన సేవలు, అనుభవం అవసరమనే ఉద్దేశంతో పదవీ కాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఎక్స్‌టెన్షన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి సీఎంవో నుంచి లేఖ కూడా రాశారు. ఒకవేళ కేంద్ర అంగీకరిస్తే.. రామకృష్ణా రావు మరో 3 నెలల పాటు సీఎస్‌గా కొనసాగుతారు. లేని పక్షంలో మరో సీనియర్ ఐఏఎస్‌కు ఆ బాధ్యతలను కట్టబెట్టనున్నారు.

ఈ క్రమంలోనే సీఎస్ రేసులో ఎవరున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయవర్గాల సమాచరం మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతోన్న సీనియర్ ఐఏఎస్ జయేశ్ రంజన్ (Jayesh Ranjan) ముందు వరుసలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు సమాచార, సాంకేతిక శాఖ, పరిశ్రమల శాఖ, ఐటీ, టెక్స్‌టైల్-హ్యాండ్లూమ్ శాఖకు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన జయేశ్ రంజన్‌, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వద్ద తన పనీతీరుతో మంచి మార్కులు కొట్టేశానే టాక్ ఉంది. అదేవిధంగా దావోస్ (Davos) పర్యటనలో తెలంగాణ (Telangana)కు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలోనే ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. దీంతో నెక్ట్స్ సీఎస్‌గా జయేశ్ రంజన్ రాబోతున్నారనే వార్త ప్రభుత్వ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Next Story