అది ముమ్మాటికీ బీఆర్ఎస్‌కు లాభమే.. మంత్రి వివేక్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

పంచాయతీ ఎన్నికల వేళ సిద్దిపేట (Siddipet) జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి.

అది ముమ్మాటికీ బీఆర్ఎస్‌కు లాభమే.. మంత్రి వివేక్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికల వేళ సిద్దిపేట (Siddipet) జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉందని ఇప్పటికే పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్‌కు రిపోర్టు అందినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కార్మిక శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జ్ గడ్డం వివేక్ వెంకటస్వామి (Vivek Venkata Swamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ (Congress) పార్టీలో సిద్దిపేట జిల్లాలో వర్గ విభేదాలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. ఎవరికి వారు గ్రూపులు కట్టి పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నారని కామెంట్ చేశారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్‌ లో వర్గపోరు ఎక్కువగా కనిపిస్తోందని, ఈ విభేదాలను పక్కనపెట్టి అందరూ ఐక్యంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేటను కాంగ్రెస్ కంచుకోటగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. కానీ, పరిస్థితి ఇలానే కొనసాగితే అది ముమ్మాటికీ ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) పార్టీకి లాభమేనని కేడర్‌ను హెచ్చరించారు. తాజాగా, మంత్రి వివేక్ వ్యాఖ్యలు జిల్లా కాంగ్రెస్ నేతల్లో చర్చనీయాంశంగా మారాయి.

Next Story