- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దపులి వ్యవసాయ క్షేత్రంలో రెస్ట్ తీసుకుంటుంది.. కేసీఆర్‌పై తలసాని షాకింగ్ కామెంట్స్
పెద్దపులి వ్యవసాయ క్షేత్రంలో రెస్ట్ తీసుకుంటుందని, అప్పుడప్పుడు వచ్చిపోతే అందరికీ భయం భయం అవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: పెద్దపులి వ్యవసాయ క్షేత్రంలో రెస్ట్ తీసుకుంటుందని, అప్పుడప్పుడు వచ్చిపోతే అందరికీ భయం భయం అవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంబర్ పేటలో నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో తలసాని మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మీ వెనుక మేం ఉన్నామని అన్నారు. కేసీఆర్ చరిత్ర, కేసీఆర్ పర్సనాలిటీ, తెలంగాణపై కేసీఆర్ కు ఉన్న నాలెడ్జ్ ఈ భూభాగంలో ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. పొట్టోడు, పొడుగోడు ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తల ఎత్తుకుని జీవించవచ్చని అన్నారు. పార్టీ మనకు కన్నతల్లి లాంటిదని, పార్టీ లేకపోతే ఎవరూ లేరని అన్నారు. పార్టీనే సుప్రీం అని వ్యాఖ్యానించారు. పార్టీ జెండా కిందనే మనం ఉంటామని అన్నారు. బస్తీలోకి వెళ్లి నేను బీఆర్ఎస్ పార్టీ అంటేనే గుర్తుపడతారు తప్ప పార్టీ నుండి తీసేసిన తరవాత మీ దగ్గరకు ఎవరూ రారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అది గుర్తుంచుకోవాలని అన్నారు.






