- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టు తప్పితే ప్రాణాలకే ప్రమాదం.. త్వరగా వెళ్లాలనే తాపత్రయం! వీసీ సజ్జనార్ ఆసక్తికర పోస్ట్
హైదరాబాద్ మహా నగరంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైతున్నాయి. నగరంలో ఏదో ఒక ప్రాంతంలో తరుచుగా వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైతున్నాయి. నగరంలో ఏదో ఒక ప్రాంతంలో తరుచుగా వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్న.. కొంత మంది వాహనాదారులు మాత్రం ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి బైక్ పై నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఫోటోలో ఉన్న ప్రకారం.. ఓ వాహనాదారుడు తన బైక్‌పై పెద్ద మూటలు వేసుకోని ప్రయాణం సాగిస్తున్నాడు. అంతే కాకుండా బైక్ పై స్థలం లేకున్నా కూడా ఆ మూటల మధ్య ఓ మహిళను వెనుక కూర్చోబెట్టుకొని నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TGSRTC MD VC Sajjanar) ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
పట్టు తప్పితే ప్రాణాలకే ప్రమాదం.. ప్రమాదమని తెలిసినా కూడా కొందరు ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నారని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. సమయం ఆదాతో పాటు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే తాపత్రయం తప్ప.. అనుకోని ప్రమాదం జరిగితే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని గుర్తించడం లేదని ఆయన వాపోయారు. ప్రమాదపుటంచున ప్రయాణం వద్దు.. మీ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వండని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా సూచించారు.






