- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. శంషాబాద్ విమానాశ్రయం వద్ద కొత్త బోర్డింగ్ పాయింట్
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే వారికి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) వెళ్లే వారికి టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. భక్తుల సౌకర్యార్థం విమానాశ్రయానికి సమీపంలో ఉన్న (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్) RGIA క్రాస్ రోడ్స్ వద్ద కొత్తగా బోర్డింగ్ పాయింట్‌ని టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఎయిర్ పోర్ట్ నుంచి పుష్పక్ బస్సుల్లో సమీపంలో ఉన్న ఆర్‌జీఐఏ బోర్డింగ్ పాయింట్‌కి భక్తులు ప్రయాణించి.. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలానికి వెళ్లొచ్చు. ఈ బోర్డింగ్ పాయింట్ నుంచి ప్రతి 20 నిమిషాలకో బస్సు శ్రీశైలానికి అందుబాటులో ఉంటుంది. ఎయిర్ పోర్టు నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు http://tgsrtcbus.in వెబ్ సైట్ లోనూ ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ సమయంలో వారు RGIA క్రాస్ రోడ్ బోర్డింగ్ పాయింట్‌ని ఎంచుకోవాలి. శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ కోరుతోంది. ఈ వివరాలను సోమవారం ఎక్స్ వేదికగా టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ (VC Sajjanar) వెల్లడించారు.






