TGS RTC: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టులకు లైన్ క్లియర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-09 02:32:19  IST  )

తెలంగాణ ఆర్టీసీలో ఎలాంటి పరీక్ష లేకుండానే 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

TGS RTC: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టులకు లైన్ క్లియర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు అందించింది. సంస్థలో ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ (Conductor) పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చాలా ఏళ్ల తర్వాత ఈ ఖాళీల భర్తీ జరుగుతుండటంతో, ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా ఈ నియామక ప్రక్రియను చేపట్టనుంది. అయతే, ఈ పోస్టులకు ఎలాంటి రాతపరీక్ష నిర్వహించడం లేదు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో పెరిగిన రద్దీ దృష్ట్యా తాత్కాలికంగా అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని వాడుకోగా.. ఇప్పుడు రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం రీజియన్ల వారీగా పర్మనెంట్ ఉద్యోగాలుగా వీటిని భర్తీ చేయనున్నారు.

నోటిఫికేషన్ విడుదలకు ఒకే ఒక్క అడ్డంకి..

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఓ చిన్న సాంకేతిక చిక్కును వీడదీయాల్సి ఉంది. గతంలో ఎస్ఎస్‌సీ బోర్డు (SSC Board) మార్కుల విధానాన్ని అమలు చేయగా.. ఆ తర్వాత కొంతకాలం జీపీఏ గ్రేడింగ్ (GPA) పద్ధతిని తెచ్చారు. మళ్లీ ఇటీవల మార్కుల విధానాన్నే కొనసాగిస్తున్నారు. దీంతో దరఖాస్తుదారుల్లో కొందరికి మార్కులు, మరికొందరికి గ్రేడింగ్ పాయింట్లు ఉండే అవకాశం ఉంది. ఈ రెండింటినీ సమానంగా ఎలా అంచనా వేయాలి.. గ్రేడింగ్‌ను మార్కుల శాతంలోకి ఏ విధంగా మార్చాలి? అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు ఎస్సెస్సీ బోర్డుకు లేఖ రాశారు. SSC బోర్డు నుంచి గ్రేడింగ్ లెక్కింపుపై క్లారిటీ వచ్చిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ రానుంది.

Next Story