- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ సొసైటీ (TREIS) నేడు, ఏప్రిల్ 27న TSRJC సెట్-2026 హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgrjc.cgg.gov.in నుండి తమ అడ్మిట్ కార్డ్‌లను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
షెడ్యూల్ ప్రకారం ప్రవేశ పరీక్ష మే 3వ తేదీ ఆదివారం నాడు జరుగుతుంది. ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు రెండున్నర గంటల పాటు ఈ పరీక్ష కొనసాగుతుంది. మొత్తం 150 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నపత్రం ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగానే ఈ ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు తమ వెంట హాల్ టిక్కెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. లేనిపక్షంలో పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఎట్టి పరిస్థితుల్లోనూ డూప్లికేట్ హాల్ టిక్కెట్లు జారీ చేయబడవు. అభ్యర్థులు ముందుగానే ప్రింటౌట్ తీసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. తెలంగాణలోని ప్రధాన జిల్లా కేంద్రాలైన ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం
ముందుగా tgrjc.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్ పేజీలో ‘TSRJC CET Hall Ticket 2026’ లింక్ పైన క్లిక్ చేయండి.
క్యాండిడేట్ ఐడి లేదా అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.
స్క్రీన్ పై కనిపించే హాల్ టిక్కెట్ వివరాలను సరిచూసుకోండి.
చివరగా డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోండి.
చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తకుండా అభ్యర్థులు త్వరగా తమ అడ్మిట్ కార్డ్‌లను పొందాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష విధానంపై అవగాహన కోసం మోడల్ పేపర్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.






