TG: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచన

by Gantepaka Srikanth |

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్ కాలేజీల్లో (టీజీఆర్జేసీ), కేజీబీవీలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఆర్జేసీ సెట్ 2026 పరీక్షకు సర్వం సిద్ధమైంది.

TG: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్ కాలేజీల్లో (టీజీఆర్జేసీ), కేజీబీవీలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఆర్జేసీ సెట్ 2026 పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఈ పరీక్ష మే 3న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. అభ్యర్థులు పరీక్షా సమయానికి సమయానికి ఒక గంట ముందుగానే, ఉదయం 9 గంటలకే కేంద్రానికి చేరుకోవాలి. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 76,173 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఏప్రిల్ 27 నుండి అధికారిక వెబ్‌సైట్ https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరీక్షా కేంద్రాలు విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలైన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, హనుమకొండ, ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట, సంగారెడ్డిలలో మొత్తం 320 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రాన్ని పరీక్షకు ఒకరోజు ముందుగానే సందర్శించి చూసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఓఎంఆర్ షీటులో సమాధానాలను కేవలం బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే గుర్తించాలి. హాల్ టికెట్‌పై పొందుపరిచిన సూచనలను విద్యార్థులు తప్పనిసరిగా పాటించాలని సంస్థ కార్యదర్శి సీహెచ్. రమణ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని 35 గురుకుల జూనియర్ కాలేజీలు, 93 కేజీబీవీలలోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులలో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.

Next Story