- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TGPSC : సీడీపీవో అభ్యర్థులకు కీలక ప్రకటన జారీ చేసిన టీజీపీఎస్పీ
ఈ నెల 23వ తేదిన సీడీపీవో(CDPO) అభ్యర్ధుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్(Certifiacte Verification) నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ నెల 23వ తేదిన సీడీపీవో(CDPO) అభ్యర్ధుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్(Certifiacte Verification) నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, అడిషనల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసీడిఎస్ వేర్ హౌస్ మేనేజర్ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థులు సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం) పబ్లిక్ గార్డెన్ రోడ్, నాంపల్లి, హైదరాబాద్ (పాత క్యాంపస్)లో హజరవ్వాలని పేర్కొంది.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు కమీషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in లో వివరాలు చెక్ చేసుకోవాలని తెలిపింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు అవసరమైన అన్ని పత్రాలను తీసుకురావాలని, ఈ నెల 21 నుంచి24 వరకు వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవాలని పేర్కొంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజర్వ్ రోజున ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోయినా, ఏదైనా కారణం చేత హాజరు కాకపోయినా, తదుపరి సమయం ఇవ్వబడదని స్పష్టం చేసింది.






