గ్రూపు-1పై ఆరోపణలు చేయించేది వాళ్లే.. TGPSC సంచలన రియాక్షన్

by Gantepaka Srikanth |
గ్రూపు-1పై ఆరోపణలు చేయించేది వాళ్లే.. TGPSC సంచలన రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూపు-1పై వస్తున్న ఆరోపణలకు TGPSC ఖండించింది. కొందరు దురుద్దేశంతోనే గ్రూపు-1పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ దురుద్దేశం వెనుక ప్రయివేట్ కోచింగ్ సెంటర్లు(Private Coaching Centers) ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసింది. ప్రొటోకాల్ ప్రకారమే నిపుణులతో వాల్యుయేషన్ చేయించినట్లు పేర్కొన్నారు. లిమిటెడ్ మార్కుల పరీక్షలో ఒకే తరహా మార్కులు రావడం సహజమని వెల్లడించింది. అంతమాత్రాన అక్రమాలు జరిగాయని అభ్యర్థులను, తెలంగాణ సమాజాన్ని తప్పబట్టడం సరికాదని హితవు పలికింది.

ఇదిలా ఉండగా.. టీజీపీఎస్సీ(TGPSC) నిర్వహించిన గ్రూప్-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి(Kaushik Reddy) డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. పరీక్ష నిర్వహణలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. ‘‘కోఠి కళాశాలలోని 18, 19వ సెంటర్లలో 1,490 మంది పరీక్ష రాస్తే.. 74 మంది ఎంపికయ్యారు. 25 సెంటర్లలో 10 వేల మంది రాస్తే కేవలం 69 మంది మాత్రమే ఎంపికయ్యారు. 654 మందికి ఒకేలా మార్కులు ఎలా వస్తాయి? అని అనుమానం వ్యక్తం చేశారు. ఓ కాంగ్రెస్‌ నేత(Congress Leader) కోడలికి ఎస్టీ విభాగంలో మొదటి ర్యాంక్‌ వచ్చింది. ఆమె కోఠి కళాశాలలోనే పరీక్ష రాసిందని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా, తాజాగా టీజీపీఎస్సీ స్పందించి కౌంటర్ ఇచ్చింది.

Next Story

Most Viewed