ఇసుక బుకింగ్స్‌పై TGMSIDC ప్రకటన

by Gantepaka Srikanth |

ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Indlu) నిర్మాణాల కోసం ఇసుక బుకింగ్‌లను నేటి నుంచి బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నట్లు టీజీఎంఎస్ఐడీసీ ప్రకటించింది.

ఇసుక బుకింగ్స్‌పై TGMSIDC ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Indlu) నిర్మాణాల కోసం ఇసుక బుకింగ్‌లను నేటి నుంచి బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నట్లు టీజీఎంఎస్ఐడీసీ ప్రకటించింది. ఇసుక తవ్వకాలు, డంపింగ్‌, విక్రయాలపై పర్యవేక్షణకు సంబంధిత ఏడీఎంఅండ్‌జీలు, పీఓలకు సంబంధిత రీచ్‌లను కేటాయించి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని టీజీఎంఎస్ఐడీసీ ఆదేశించింది. రీచ్ నుండి స్టాక్‌యార్డు వరకు ఏ లారీని లోపలికి అనుమతించవద్దని, ఇసుక లారీల ఓవర్‌లోడ్‌ను నివారించాలని, అనుమతించబడిన లారీ మాత్రమే నడపాలని ఆదేశించింది. బల్క్ పరిమాణంలో డెలివరీని బుక్ చేసుకోవడానికి రోజుల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదని టీజీఎంఎస్ఐడీసీ(TGMSIDC) స్పష్టం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆయా ప్రాజెక్టులకు నెలవారీ ఇసుక వినియోగానికి సంబంధించిన వివరాలను అందించాలని టీజీఎంఎస్ఐడీసీ అధికారులను కోరింది.

Next Story