TS ICET 2025: టీజీఐసెట్ 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్

by Ramesh Naini |

టీజీఐసెట్ 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయింది.

TS ICET 2025: టీజీఐసెట్ 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: (TS ICET 2025) టీజీఐసెట్ 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయింది. ఫైనల్ ఫేజ్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ కోసం ఈ నెల 15 న ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని ఐసెట్ 2025 అడ్మిషన్ల కన్వీనర్ దేవసేన (Devasena) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16న ధృవపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 17వ తేదీ వరకు ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 20 న లేదా అంతకంటే ముందుగానే సీట్ల తాత్కాలిక కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. పూర్తి సమాచారం, హెల్ప్‌లైన్ కేంద్రాల జాబితా , కోర్సుల వివరాలకు https://tgicet.nic.in వెబ్‌సైట్‌ ను సంప్రదించాలని తెలిపారు. వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లను నమోదు చేయడం ద్వారా మంచి కాలేజీలో సీటు పొందే అవకాశం ఉంటుందని ఆమె విద్యార్థులకు సూచించారు.

Next Story