- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారిశ్రామిక ప్రాంతాలపై TGIIC ఫోకస్.. రూ.42 కోట్లతో అభివృద్ధి పనులు
పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా టీజీఐఐసీ అడుగులు వేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా టీజీఐఐసీ అడుగులు వేస్తున్నది. ఈ మే రకు రూ.42 కో ట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని ని ర్ణయం తీసుకుంది. ఇందుకు టెండర్లను సైతం ఆహ్వానించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో రా ష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ముఖ్యమైన అభివృద్ధి పనుల కోసం ఈ-ప్రొక్యూర్‌మెంట్ నోటీసు ద్వారా 10 పనులకు టెండర్లను ఆహ్వానించిం ది. ఈ నోటీసులో మొత్తం పనుల అంచనా వ్యయం రూ.79,36,097 నుంచి రూ. 16, 73,20,476 వరకు ఉంది.
ముఖ్యమైన టెండర్ పనులు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలెపల్లి గ్రామంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద స్టార్మ్ వాటర్ డ్రెయిన్స్ నిర్మాణానికి రూ.16 కోట్ల 73 లక్షల 20 వేల 476తో టెం డర్లు పిలిచా రు. వనపర్తి జిల్లా నాగవరం గ్రా మంలో ఐటీ హబ్ భవనం నిర్మాణానికి రూ. 11కోట్ల 54లక్షల 83వేల 689 లతో టెండర్లు ఆహ్వానించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్‌వల్లిలో చెన్నకేశవకుంట నుంచి తుంగవానికుంట వరకు సర్‌ప్లస్ కోర్సు ఛానెల్ పునరుద్ధరణకు రూ.6 కోట్లు 11లక్షల 88వేల 550 లతో టెండర్లు పిలిచారు.
ఇతర కీలక అభివృద్ధి పనులివి..
వరంగల్ జిల్లా ఇండస్ట్రియల్ పార్క్ లో జోనల్ ఆఫీస్ భవనం నిర్మాణానికి సైతం టెండర్లు ఆహ్వానించారు. అంచనా వ్యయం రూ.3 కోట్ల 36 లక్షల 53 వేల 581 అంచనా వ్యయంగా పేర్కొన్నారు. అలాగే.. మెదక్ జిల్లా తూప్రాన్ ఇండస్ట్రియల్ పార్క్ లో అంతర్గత రోడ్లు, బ్లాక్ టాపింగ్ కోసం రూ.2 కోట్ల 7లక్షల 31వేల 679 లతో.. సిద్దిపేట జిల్లా కోత్యాల్ బయోటెక్ పార్క్, ఫేజ్-IV వద్ద ప్రీస్ట్రెస్డ్ ప్రీకాస్ట్ ప్రహరీ నిర్మాణానికి రూ. కోటి 51 లక్షల 8వేల 359 లతో టెండర్లు ఆహ్వానిం చారు. వీటితోపాటు మహబూబ్‌నగర్ జిల్లా జ డ్చర్ల గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో 9 మీటర్ల ఎ త్తైన ఆక్టోగోనల్ పోల్స్ తో ఎల్ఈడీ లైట్ల ఏ ర్పాటుకు రూ. కోటి 40లక్షల 7వేల 680తో.. కామారెడ్డి జిల్లా లింగంపల్లిలోని స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లో అలంకారిక స్తంభాలతో వీధి దీపాల ఏర్పాటుకు రూ. 89 లక్షల 80 వేల 261లతో టెండర్లు పిలిచారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల గ్రామంలోని మిస్టర్స్ క్రోమ్టన్ గ్రీవ్స్ భూమి నుంచి 33 కేవీ టవర్స్ లైన్ మార్చడానికి రూ.79 లక్షల 36 వేల 97లతో, ఖమ్మం జిల్లా బుగ్గపాడు వద్ద స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లోని అంతర్గత రోడ్లన్నింటికీ 2వ నంబర్ 11 కేవీ ఫీడర్ లైన్ల ఏర్పాటుకు రూ.33 లక్షల 28 వేల 430లతో టెండర్లను ఆహ్వానించారు. కాంట్రాక్టర్లు టెండర్లను సమర్పించడానికి ముఖ్యమైన తేదీలు సైతం ప్రకటించారు. బిడ్ డౌన్ లోడ్ ప్రారంభ తేదీ ఈ నెల 17 నుంచే ప్రారంభమైంది. బిడ్లు సమర్పించడానికి చివరి తేదీ వచ్చేనెల 3, మధ్యా హ్నం 3 గంటల వరకు ఇచ్చారు. మరిన్ని వివరాలకు కాంట్రాక్టర్లు టీజీఐఐసీ అధికారిక ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌ను సందర్శించవచ్చని చీఫ్ ఇంజినీర్ తెలిపారు.






