- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్‌గా మార్చాలి.. ముఖ్యమంత్రికి టీజీజీడీఏ వినతి
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో వైద్యులు, సిబ్బంది తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని టీవీవీపీని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (డీ.ఎస్.హెచ్.ఎస్)గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో వైద్యులు, సిబ్బంది తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని టీవీవీపీని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (డీ.ఎస్.హెచ్.ఎస్)గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరింది. రాష్ట్రంలో టీవీవీపీ పరిధిలోని వైద్యులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం టీజీజీడీఏ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మూడు ప్రధాన విభాగాలకు సంబంధించిన ప్రభుత్వ వైద్యుల అత్యవసర, దీర్ఘకాలిక సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత అక్కడి వైద్య విధాన పరిషత్ ను సెకండరీ హెల్త్ కేర్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారని, మన రాష్ట్రంలోనే పెండింగులో ఉందని సీఎం దృష్టికి తీసుకు పోయారు. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలోని వైద్యుల సీనియారిటీని రక్షించేందుకు జీఓ ఎంఎస్ నెం.142లో సవరణ చేయాలని టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డా. బి నరహరి సీఎంను కోరారు.
గిరిజన మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ
గ్రామీణ, గిరిజన మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీకి ప్రత్యేక అలవెన్స్ ఇవ్వడం లేదని, అవి మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అలవెన్స్ ఇవ్వడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ పనిచేసేందుకు ఉన్నత స్థాయి వైద్యులు కూడా ఆసక్తి చూపిస్తారని తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) పరిధిలోని వైద్యులకు టైమ్‌బౌండ్ ప్రమోషన్లు ఆలస్యమయ్యాయని, సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. మెడికల్ కాలేజీల ఫ్యాకల్టీకి ఎర్న్డ్ లీవ్ (ఈఎల్) ఎన్‌క్యాష్‌మెంట్‌ను మంజూరు, ఖాళీగా ఉన్న పోస్టులకు ప్రొఫెసర్లను వెంటనే బదిలీ చేయడం తదితర సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్లపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ప్రభుత్వ స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డా బి నరహరి తెలిపారు. సమావేశంలో మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, టీజీజీడీఏ ప్రధాన కార్యదర్శి డా. ఆర్. లాలూ ప్రసాద్ రాథోడ్, ట్రెజరర్ డా. ఎం.కె. రౌఫ్, వైస్ ప్రెసిడెంట్ డా. దీన్ దయాల్, జనరల్ సెక్రటరీ-2 డా. సంధ్యారాణి నిప్పని పాల్గొన్నారు.






