- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: నేడు త్రిసభ్య కమిటీ సమావేశం.. గులాబీ బాస్ వచ్చేనా..!
స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (State Chief Information Commissioner)తో పాటు సహచర కమిషనర్ల నియామకాలను పూర్తి చేసేందుకు ఇవాళ త్రిసభ్య కమిటీ (Three-member Committee) భేటీ కానుంది.

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (State Chief Information Commissioner)తో పాటు సహచర కమిషనర్ల నియామకాలను పూర్తి చేసేందుకు ఇవాళ త్రిసభ్య కమిటీ (Three-member Committee) భేటీ కానుంది. ఈ మేరకు సచివాలయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు ఇప్పటికే అధికారులు షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గడువు గతేడాది ఫిబ్రవరి చివరి వారంలో పూర్తి అయింది. కానీ, ఇప్పటికే కొత్త కమిషన్ బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నా.. నియామకంపై పాలనాపరమైన సమస్యలు నెలకొనడంతో ఆ ప్రకియ వాయిదా వేస్తూ వస్తున్నారు. కొత్త కమిషన్ నియామకంలో జాప్యంపై ఇప్పటికే హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు కాగా.. అక్కడ విచారణ కూాడా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ (Telangana Government) కొత్త కమిషన్ నియామకంపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు కాసేపట్లో సచివాలయం వేదికగా త్రిసభ్య కమిటీ భేటీ కానుంది.
సమావేశానికి గులాబీ బాస్ వచ్చేనా.!
అయితే, స్టేట్ ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్‌తో పాటు సహచర కమిషనర్ల ఎంపిక కమిటీలో చైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), సభ్యులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) ఉన్నారు. వారు ముగ్గురు సమావేశమై.. సీఎస్ శాంతికుమారి (CS), ఇతర ఐఏఎస్ అధికారులు స్క్రూట్నీ చేసిన దరఖాస్తుల్లో ఏడుగురిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఈ భేటీకి గులాబీ బాస్ హాజరు అవుతారా.. లేదా? అనే సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే కేసీఆర్ (KCR) బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేవలం గవర్నర్ (Governor) ప్రసంగం రోజున మాత్రమే సభకు హాజరయ్యారు. ఆ తరువాత మళ్లీ అసెంబ్లీ (Assembly)లో అడుగు పెట్టలేదు. అనంతరం రాజ్‌భవన్ (Raj Bhavan)లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) ఇచ్చిన తేనీటి విందుకు కూడా డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే.
అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ (KCR), బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Government) వైఫల్యాలను ఎండగడుతూ మాటల దాడికి దిగారు. ఈ మొత్తం పరిణామల నేపథ్యంలో ఆర్టీఐ (RT) కమిషనర్ల ఎంపిక సమావేశానికి కేసీఆర్ (KCR) రావడం అనుమానమేనని అటు అధికార పార్టీలో.. ఇటు బీఆర్ఎస్ (BRS)లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ (KCR) సమావేశానికి హాజరైతే ఆయన ఇచ్చే సలహాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాని పక్షంలో సమావేశానికి గైర్హాజరయ్యారని మినిట్స్‌లో నోట్ చేసి స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ((State Chief Information Commissioner)తో పాటు సహచర కమిషనర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసే ఛాన్స్ ఉంది. కాగా, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టుకు ప్రస్తుత సీఎస్ శాంతికుమారి (CS Shanthi Kumari) సహా పలువురు ప్రముఖులు పోటీ పడుతున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.






