- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: భానుడి భగభగ..! రాష్ట్రంలో దంచికొడుతోన్న ఎండలు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలకు జనం విలవిల్లాడిపోతున్నారు. మార్చిలోనే ఎండ ప్రభావం అధికంగా ఉండడంతో జనం అల్లాడిపోతున్నారు. సాధారణంగా మార్చిలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. మార్చి నెలాఖరు నాటికి వేడితీవ్రత అధికంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే తెలంగాణలోని ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో .. ఎండలు పెరిగాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు అంచనా వేసింది. సాధారణం కన్న 3 నుంచి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్,మెదక్, నిజామాబాద్, భద్రాచలం జిల్లాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలియజేసింది. ఇటీవల వాతావరణ శాఖ కొన్ని లెక్కలు విడుదల చేసింది. ఆ శాఖ లెక్కల ప్రకారం 1901 నుంచి 2025 వరకు పరిశీలిస్తే.. ఈ ఏడాది ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్, మేలో వడగాలుల ప్రభావం నెలకొనాల్సి ఉండగా.. ఈ ఏడాది మార్చి నుంచే వడగాలుల తీవ్రత అధికమైంది.
ఎండలతో ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఇప్పటికే భానుడు తీవ్ర ప్రతాపం చూపడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట కూడా ఉష్ణోగ్రత పెరిగడంతో పలువురు విస్తుపోతున్నారు. ఇప్పటికే కూలర్ల వినియోగంతోపాటు విక్రయాలు పెరిగాయి. ఎండలో అత్యవసరమైతే తప్ప బయట తిరగకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎండల సమయంలో కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తక్షణ దాహర్తి కోసం కూల్‌డ్రింక్స్ జోలికి పోవద్దని సూచిస్తున్నారు. బాడీ డీ హైడ్రేడ్ కాకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. అధిక వేడిమి ఎదురైతే.. లేత రంగులు కలిగిన కాటన్ దుస్తులను ధరించాలని సూచిస్తున్నారు. ఇళ్లలో ఇండోర్ ప్లాంట్స్‌తోపాటు బాల్కనీల్లో మొక్కలు పెంచుకుంటే.. ఉష్ణోగ్రత నుంచి బయటపడవచ్చునని సలహా ఇస్తున్నారు.
ప్రాంతం - ఉష్ణోగ్రత (డిగ్రీల్లో)
ఆదిలాబాద్ - 37.8
భద్రాచలం - 38
హకీంపేట్ - 36.4
దుండిగల్ - 35.9
హన్మకొండ - 35
హైదరాబాద్ - 35.4
ఖమ్మం - 36.4
మహబూబ్‌నగర్ - 37.5
మెదక్ - 37.6
నల్గొండ - 34.5
నిజామాబాద్ - 37.1
రామగుండం - 35.2






