- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : కొరడా ఝుళిపించిన రవాణా శాఖ.. ట్రావెల్ బస్సులపై భారీగా కేసులు
by Muthe.Rajitha |
ప్రైవేట్ ట్రావెల్స్(Private Travels) పై రవాణా శాఖ కొరడా ఝుళిపించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రైవేట్ ట్రావెల్స్(Private Travels) పై రవాణా శాఖ కొరడా ఝుళిపించింది. నిబంధనలకు వ్యతిరేకంగా బస్సులు నడుపుతున్న పలు ట్రావెల్స్ పై 300 కేసులు నమోదు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 12 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపపట్టిన అధికారులు.. అనుమతి పత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనాలపై 300 దాకా కేసులు నమోదు చేసి, ఆయా వాహనాలను సీజ్ చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ట్రావెల్స్ వారు ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ, అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. తనిఖీలు ఇలాగే కొనసాగుతూనే ఉంటాయని, ప్రయాణీకుల నుంచి ఫిర్యాదులు వస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Next Story






