- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
TG Medical PG Admissions: పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రాసెస్ స్టార్ట్.. నవంబర్ 7వ తేది వరకు దరఖాస్తులు స్వీకరణ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మెడికల్ పీజీ(Medical PG) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2024-25 సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద ఎండీ(MD), ఎంఎస్(MS), డిప్లొమా(Diploma) మెడికల్ కోర్సుల్లోని సీట్లను భర్తీ చేయనున్నారు. కాళోజీ వర్సిటీతో పాటు నిమ్స్‌కు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్లనూ భర్తీ చేయనున్నారు. నీట్ పీజీ-2024(NEET PG-2024) అర్హత కలిగిన అభ్యర్థులు గురువారం (31-10-2024) ఉదయం 6 గంటల నుంచి వచ్చే నెల 7 వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://tspgmed.tsche.in_వెబ్‌సైట్‌లో స్కాన్ చేసిన సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక కన్వీనర్ కోటాలో అడ్మిషన్ల కోసం స్టేట్ మెరిట్ స్థానాన్ని నిర్ణయిస్తారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అప్‌లోడ్ చేసిన అన్ని సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత తాత్కాలిక తుది మెరిట్ జాబితా ప్రదర్శిస్తారు. ఇక పీజీ మెడికల్ కోర్సుల కోసం నీట్ పీజీ-2024 పరీక్షలో కట్-ఆఫ్ స్కోర్‌ను వెల్లడించారు. ఓపెన్ కేటగిరీకి 50 పర్సంటైల్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 పర్సంటైల్, ఓసీల్లో వైకల్యం ఉన్నవారికి 45 పర్సంటైల్‌ను ఖరారు చేశారు. ఇక ఎండీ ఆయుర్వేద, హోమియో, యునాని కోర్సుల్లో ప్రవేశాలకు కూడా నోటిఫికేషన్లు జారీచేశారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచే వాటికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐఏపీజీఈటీ-2024 పరీక్షలో అర్హత సాధించినవారు ఈ మూడు కోర్సుల్లో చేరేందుకు అర్హులు.
నాలుగేళ్లు చదవాల్సిందే..ఆ కాలేజీకి వెసులుబాటు..
మెడికల్ పీజీ అడ్మిషన్ కొరకు తప్పనిసరిగా స్థానిక అభ్యర్థులై ఉండాలి. కంటిన్యూగా తెలంగాణలో నాలుగేళ్లు చదివి ఉండాలి. అయితే విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో చదివిన మన విద్యార్థులను కూడా స్థానికులుగానే భావిస్తామని వర్సిటీ తన నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు అంచనా వేసిన ప్రకారం 26 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2,800 పీజీ మెడికల్ సీట్లున్నాయి. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో 50 శాతం జాతీయ కోటా కౌన్సిలింగ్‌లో భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని పూర్తిగా తెలంగాణ వాసులకే (లోకల్ )కేటాయిస్తారు. నేషనల్ కోటాలో దాదాపు ఐదారు వందల సీట్లు వెళ్తాయి. మరోవైపు ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటికి లేదా అంతకుముందే ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ఇన్-సర్వీస్ కోటా అభ్యర్థుల విషయంలో ప్రభుత్వంలో వారు చేసిన ఉద్యోగాన్ని గత నెల 30వ తేదీ వరకు పరిగణలోకి తీసుకుంటారు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కన్వీనర్ కోటా సీట్లకు అర్హులు కారు. పీజీ, డిప్లొమా కోర్సులకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుం ఓసీ, బీసీలకు రూ. 5,500, ఎస్టీలకు రూ. 5 వేలు ఆన్‌లైన్లో చెల్లించాలి. ఆయా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన వెబ్ ఆప్షన్లను తేదీలను తర్వాత వెబ్‌సైట్లో వెల్లడిస్తారు. నీట్ పరీక్షలో కటాఫ్ స్కోర్ కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించే సమయంలో ఏమైనా సందేహాలు వస్తే 9392685856, 7842136688, 9059672216లకు ఫోన్ లేదా,ఇతర సమస్యల కోసం [email protected]కు ఈ-మెయిల్ చేయాలని వర్సిటీ తన నోటిఫికేషన్ లో పేర్కొంది.