TG: ధాన్యం కొనుగోళ్లపై కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

TG: ధాన్యం కొనుగోళ్లపై కీలక నిర్ణయం

TG: ధాన్యం కొనుగోళ్లపై కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఈ వానాకాలంలో రికార్డు స్థాయిలో పండించిన ధాన్యంలో 80 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లయిస్(Telangana Civil Supplies Department) ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 8433 కొనుగోలు కేంద్రాలు నెలకొల్పింది. డిసెంబర్ 10వ తేదీ నాటికి 51.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ధాన్యం విలువ మొత్తం రూ.13661 కోట్లు. ఇందులో 26.37 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 25.49 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం. గత వానాకాలం తరహాలోనే ఈసారి కూడా సన్నాల ఉత్పత్తి పెరిగింది. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాలుకు రూ.500 అదనపు బోనస్ చెల్లిస్తుండటంతో సన్నరకాల సాగుకు రైతులు మొగ్గుచూపారు. ఇప్పటి వరకు రూ.314 కోట్లు ప్రభుత్వం సన్నాలకు బోనస్‌గా చెల్లించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

Next Story