టీజీ ఐసెట్-2025 దరఖాస్తు గడువు పొడిగింపు

by Ajay Maddhiboyina |

టీజీ ఐసెట్-2025 దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొ. అలువాల రవి తెలిపారు.

టీజీ ఐసెట్-2025 దరఖాస్తు గడువు పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీ ఐసెట్-2025 దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొ. అలువాల రవి తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర వర్గాల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఇది చివరి తేదీ అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 51,857 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Next Story