టీజీ ఐసెట్ 2025 స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

by Ajay Maddhiboyina |

టీజీఐసెట్ 2025 అడ్మిషన్లకు సంబంధించి ట్యూషన్ ఫీజు చెల్లించడానికి గడువు ఈ నెల 24 వరకు పొడిగించారు. అలాగే, విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేయడానికి చివరి తేదీని ఈ నెల 25 వరకు పొడిగించినట్లు

టీజీ ఐసెట్ 2025 స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఐసెట్ 2025 అడ్మిషన్లకు సంబంధించి ట్యూషన్ ఫీజు చెల్లించడానికి గడువు ఈ నెల 24 వరకు పొడిగించారు. అలాగే, విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేయడానికి చివరి తేదీని ఈ నెల 25 వరకు పొడిగించినట్లు సాంకేతిక విద్యా కమిషనర్, టీజీఐసెట్ 2025 అడ్మిషన్స్ కన్వీనర్ దేవసేన తెలిపారు. అంతేకాకుండా, టీజీఐసెట్ 2025 ప్రవేశాలకు సంబంధించి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు.

ఈ షెడ్యూల్ ప్రకారం: ఆన్‌లైన్ ద్వారా ప్రాథమిక సమాచారాన్ని సమర్పించడం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ కు అక్టోబర్ 5 వరకు అవకాశం కల్పించారు. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్టోబర్ 6 న జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆప్షన్ల ఎంచుకోవడానికి అక్టోబర్ 6 నుంచి 7 వరకు అవకాశం ఉంటుంది. ఆప్షన్ల ఫ్రీజింగ్ అక్టోబర్ 7, సీట్ల కేటాయింపు అక్టోబర్ 10 న, ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ కు అక్టోబర్ 10 నుంచి 13 వరకు అవకాశం కల్పించారు.

Next Story