- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీజీఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
టీజీఐసెట్ 2025 అడ్మిషన్లకు సంబంధించి రెండు విడతల్లో కౌన్సెలింగ్ జరగనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఐసెట్ 2025 అడ్మిషన్లకు సంబంధించి రెండు విడతల్లో కౌన్సెలింగ్ జరగనుంది. మొదటి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 5 వరకు నిర్వహించనున్నారు. చివరి విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 8 నుంచి 16 వరకు నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను బుధవారం మాసబ్ ట్యాంక్ లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు. టీజీసీహెచ్ఈ ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ సమావేశంలో కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, టీజీఐసెట్2025 అడ్మిషన్ల కన్వీనర్ దేవసేన పాల్గొన్నారు.
ఎంబీఏ, ఎంసీఏ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు సెప్టెంబర్ 15 లోగా https://tgicet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వివరాలతో కూడిన నోటిఫికేషన్ ఆగస్టు 18 న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందన్నారు. తాజా సమాచారం కోసం అభ్యర్థులు, తల్లిదండ్రులు వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు చూస్తుండాలని అధికారులు సూచించారు.
మొదటి విడత కౌన్సెలింగ్ వివరాలు:
ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ తేదీలు: ఆగస్టు 20 నుంచి 28 వరకు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ : ఆగస్టు 22 నుంచి 29 వరకు (ఆగస్టు 27 మినహా)
ఆప్షన్ల ఎంపిక: ఆగస్టు 25 నుండి 30 వరకు.
ఆప్షన్ల ఫ్రీజింగ్: ఆగస్టు 30
సీట్ల తాత్కాలిక కేటాయింపు: సెప్టెంబర్ 2 న
ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్: సెప్టెంబర్2 నుండి 5 వరకు.
తుది విడత కౌన్సెలింగ్ వివరాలు:
మొదటి విడతలో పాల్గొనని అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 8 నుండి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ : సెప్టెంబర్ 9
ఆప్షన్ల ఎంపిక: సెప్టెంబర్ 9 నుండి 10 వరకు.
ఆప్షన్ల ఫ్రీజింగ్: సెప్టెంబర్ 10
సీట్ల తాత్కాలిక కేటాయింపు: సెప్టెంబర్ 13
ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్: సెప్టెంబర్ 13 నుండి 15 వరకు.
కేటాయించిన కాలేజీలో రిపోర్టింగ్: సెప్టెంబర్ 15 నుండి 16 వరకు
- Tags
- TG-ICET 2025






