TG High Court: హైకోర్టులో సీఎం రేవంత్‌‌కు స్వల్ప ఊరట.. ఆ కేసులో విచారణ వాయిదా

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-25 06:43:45  IST  )

2024 లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారంలో భాగంగా బీజేపీ (BJP)పై చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు (Nampally People's Representatives Court)లో నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేసిన విషయం విదితమే.

TG High Court: హైకోర్టులో సీఎం రేవంత్‌‌కు స్వల్ప ఊరట.. ఆ కేసులో విచారణ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారంలో భాగంగా బీజేపీ (BJP)పై చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు (Nampally People's Representatives Court)లో నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేసిన విషయం విదితమే. అదేవిధంగా హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌లో తుది తీర్పు వెలువడే వరకు దిగువ కోర్టు ఎదుట హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రేవంత్ అభ్యర్థన మేరకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లుగా పేర్కొంది. ఇక ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తున్న కేసుపై స్టేకు నిరాకరించింది. కేసులో తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొంది.

కాగా, 2024 మే 5న కొత్తగూడెం (Kothagudem)లో నిర్వహించిన ‘జన జాతర’ (Jana Jathara) సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana)లో బీజేపీ అధికారంలోకి వస్తే SC, ST రిజర్వేషన్లను ఎత్తవేస్తుందని కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు (Kasam Venkateshwarlu) నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్‌ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) రిజర్వేషన్ల తొలగిస్తామని మాట్లాడినట్లుగా ఫేక్ వీడియో (Fake Video)ను క్రియేట్ చేశారని. అదే వీడియోను సోషల్ మీడియా (Social Media)లోనూ షేర్ చేశారని పేర్కొన్నారు. అయితే, తాజాగా రేవంత్ క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం విచారణను జూన్ 12కు వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది.

Next Story