- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG High Court: SLBC టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్.. వాదనలు వినిపించిన ఏజీ
ఎస్‌ఎల్‌బీసీ టెన్నెల్ (SLBC Tunnel) 8 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎస్‌ఎల్‌బీసీ టెన్నెల్ (SLBC Tunnel) 8 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన రాజకీయ ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. పదేళ్ల పాటు అధకారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ (BRS Government) సకాలంలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకపోవడం వల్లే ప్రమాదం జరగిందంటూ అధికార పక్షం ఆరోపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) ఉదాసీనత వల్లే ఇంతటి ఘోరం జరగిందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎస్ఎల్‌బీసీ టన్నెల్ (SLBC Tunnel)లో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు (High Court)లో నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ (National Union for Migrant Workers) అనే సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (Public Interest Litigation) దాఖలు చేశారు.
అయితే, టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఆ పిల్‌లో పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజులు గడుస్తున్నా.. సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. ఈ మేరకు పిల్‌పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (Advocate General) సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) తన వాదనలు వినిపించారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసిందని కోర్టుకు విన్నవించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) టీమ్‌తో పాటు ఆర్మీ (ARMY), సింగరేణి (Singareni) బృందాలు 24 గంటలకు కష్టపడుతున్నాయని తెలిపారు. ఎప్పటికప్పుడు సీఎంతో పాటు సంబంధించి శాఖ మంత్రి కూడా సహాయక చర్యలను మానిటరింగ్ చేస్తున్నారని ధర్మాసనానికి విన్నవించారు. ఈ మేరకు ఏజీ చెప్పిన విషయాలను కోర్టు నోట్ చేసుకుని విచారణను ముగిస్తున్నట్లగా ప్రకటించింది.






