TG Govt.: ఇందిరమ్మ ఇంటి నమూనాను విడుదల చేసిన సర్కార్.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్

by Kema Shiva Kumar |

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ (Congress Government) ఇవాళ లాంఛనంగా ప్రారంభించనుంది.

TG Govt.: ఇందిరమ్మ ఇంటి నమూనాను విడుదల చేసిన సర్కార్.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ (Congress Government) ఇవాళ లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్‌ (Mobile Application)ను ప్రారంచారు. అయితే, ఈ కార్యక్రమంలో అధికారులు ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇంటి నమూన అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అందుక సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, తొలి విడతలో భాగంగా సొంత స్థలం (Own Land), రేషన్‌ కార్డు (Ration Card) ఉన్న వారికి ప్రాధాన్యతను ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక రెండో దశలో స్థలాలు లేని వారికి స్థలం అందించి, ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లగా తెలుస్తోంది. మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లు మంజూరు అయ్యాయి.

Next Story