- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt.: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. క్యూఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులు
పేదలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది.

దిశ, తెలంగాణ బ్యూరో: పేదలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉగాది నుంచే క్యూఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని భావిస్తోంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే కార్డు హోల్డర్ డిటేయిల్స్‌తోపాటు ఫ్యామిలీ మెంబర్ల డిటేయిల్స్ డిస్ ప్లే అవుతాయి. కార్డుపై ఫ్యామిలీ మెంబర్ల పేర్లు, అడ్రాస్ వివరాలు ముద్రిస్తారు. ఉగాది నుంచే కొత్త కార్డుల పంపిణీని ప్రారంభించే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ఇటీవల సమీక్ష చేసిన సీఎం రేవంత్‌రెడ్డి .. కార్డు కలర్, కార్డు సైజ్‌ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
నీలిరంగులో కార్డులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటినుంచి.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన కార్డులే ఇప్పటి వరకూ చలామణి అవుతున్నాయి. ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ఆధారంగా .. థంబ్ ఇంప్రెషన్ ద్వారా .. కొన్ని కుటుంబాలకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. కొత్తగా పంపిణీ చేసే కార్డులు నీలిరంగులో ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం. ముందుగా కొత్తగా ఎంపికైన కుటుంబాలకు వాటిని అందజేస్తారు. మిగతావారికి దశలవారీగా ..క్యూఆర్ కోడ్‌తో కూడిన రేషన్ కార్డులను జారీ చేస్తారు.
చిప్ కార్డులకు ఖర్చు ఎక్కువ
తొలుత చిప్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకోసం ఒక్కొక్క కార్డుకు దాదాపు రూ.600 వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఖర్చు ఎక్కువైతే.. ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందన్న ఉద్దేశంతో.. క్యూఆర్ కోడ్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులను అందరికీ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్డుపై ఒకవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో.. మరోవైపు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటో ..మధ్యలో క్యూర్ కోడ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.






