TG Govt.: పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

మండు వేసవిలో రేవంత్ సర్కార్ (Revanth Government) మరో గుడ్ న్యూస్ చెప్పింది.

TG Govt.: పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మండు వేసవిలో రేవంత్ సర్కార్ (Revanth Government) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం (Lunch) పెట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విద్యా శాఖ (Department of Education) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే పరీక్ష రాసేందుకు విద్యార్థులు మండల కేంద్రాలకు వస్తున్నారు. ఈ క్రమంలోనే వేసవి తాపానికి కొందరు విద్యార్థులు అక్కడక్కడ అస్వస్థతకు గురవుతున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వ పాఠశాల పరీక్షా కేంద్రం అయి ఉంటే.. అందులో ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు ఎవరైనా సరే.. అందరికీ మధ్యాహ్న భోజనం పెట్టి పంపాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అయితే, ఈ నెల 21న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. పది పరీక్ష రాస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంపై సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story