- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Govt: విద్యార్థులకు తీపికబురు.. ‘సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’ మెనూ ఖరారు!
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ‘సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్' మెనూ ఎట్టకేలకు ఖరారైనట్లుగా తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. గతంలో ప్రకటించిన విధంగా ‘సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’ (CM Breakfast Scheme) అమలుకు సంబంధించి అధికారులు తాజాగా కసరత్తు పూర్తి చేసి మెనూను కూడా సిద్ధం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం బలవర్ధకమైన అల్పాహారం అందనుంది.
రూ.720 కోట్ల భారీ కేటాయింపు
ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లను తగ్గించడంతో పాటు, పేద విద్యార్థులలో పోషకాహార లోపాన్ని నివారించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ.720 కోట్లను కేటాయించింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. అయితే, విద్యార్థులకు బోర్ కొట్టకుండా, అదే సమయంలో శక్తినిచ్చేలా చిరుధాన్యాలు (Millets), పౌష్టిక పదార్థాలతో కూడిన మెనూను అధికారులు రూపొందించారు.
వీక్లీ మెనూ వివరాలు ఇవే..
సోమవారం: వేడివేడి దోశ, పాలు
మంగళవారం: మిల్లెట్ ఇడ్లీ, రాగి జావ
బుధవారం: పూరీ, పాలు
గురువారం: మిల్లెట్ ఇడ్లీ- రాగి జావ
శుక్రవారం: మిల్లెట్ ఉప్మా/పొంగల్, పాలు
శనివారం: బోండా- రాగి జావ
పిల్లల్లో క్యాల్షియం (Calcium), ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు వారానికి మూడు రోజులు రాగి జావ, మిగిలిన మూడు రోజులు పాలను మెనూలో చేర్చారు. ముఖ్యంగా చిరుధాన్యాల (Millets) వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పిల్లల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పథకం అమలులో ఆహార నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పాఠశాల యాజమాన్య కమిటీలు (SMCs), అధికారులు ప్రతిరోజూ ఆహారాన్ని తనిఖీ చేయనున్నారు. పాఠశాల ప్రారంభ సమయానికి ముందే విద్యార్థులకు ఈ అల్పాహారాన్ని వడ్డించేలా చర్యలు తీసుకోనున్నారు.






