- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt. తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. LRSపై నేడు సర్కార్ మార్గదర్శకాలు
లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS)లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS)లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది. అదేవిధంగా ఎల్‌ఆర్‌ఎస్ (LRS) ఫీజులోనూ 25 శాతం రాయితీ ఇవ్వనున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. మార్చి 31లోగా ఈ రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో రాయితీ వర్తించనుంది. అయితే, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా పక్కా ప్రణాళికను రూపొందించింది.
ఈ క్రమంలోనే ప్రభుత్వ భూములు (Government Lands), జల వనరులకు పరిధిలో ఉన్న సర్వే నంబర్లకు సంబంధించిన దరఖాస్తులను మినహాయించి.. మిగిలి అన్ని దరఖాస్తులను ఆటోమెటిక్‌గా ఫీజు జనరేట్ చేసే సిస్టమ్‌ను తీసుకురానున్నారు. అందుకు సంబంధించి మరో రెండు రోజుల్లో ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ (Special Software)ను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో మరింత స్పష్టత ఇస్తూ తెలంగాణ సర్కార్ (Telangana Government) ఎల్ఆర్ఎస్ పథకంపై మార్గదర్శకాలు విడుదల చేయనుంది. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంలో ఇప్పటికే కొన్ని సవరణలు చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేయగా.. ఇవాళ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనను సులభతరం చేస్తూ మార్గదర్శకాలను జారీ చేయనుంది. అదేవిధంగా దరఖాస్తులకు సంబంధించి రుసుము సమాచారాన్ని కూడా వెల్లడించనున్నారు. ఇక ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ (Buffer Zone)కు 200 మీటర్ల దూరంలో ఉండే ప్లాట్ల విషయంలో ఇతర శాఖ అధికారుల విచారణకు ప్రమేయం లేకుండా, సర్కార్ భూములను ఆనుకొని లేని సర్వే నంబర్లలో వేసిన లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు పెట్టిన దరఖాస్తుల విషయంలో కూడా ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుందని సమాచారం.






