- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో విడుదలకు అవకాశం
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై (Telangana Government) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయంపై ప్రభుత్వం కాసేపట్లో జీవో (G.O) విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. జీవో వెలువడిన వెంటనే (Local body elections) స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు మార్గం సుగమం కానున్న విషయం తెలిసిందే.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసిందని, ఒకటి రెండు రోజుల్లోనే షెడ్యూల్ విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. (BC reservations) బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు వేగవంతం కానుంది. ఎప్పుడెప్పుడా అని బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదలకు రాష్ట్ర ప్రజలు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
కాగా, గురువారం (నిన్న) తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం, 27 శాతం ఎస్సీ, ఎస్టీలకు, మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.






