Engineering counseling: ఇంజినీరింగ్ విద్యార్థులకు అలర్ట్.. కౌన్సెలింగ్ పై కీలక అప్ డేట్

by Prasad Jukanti |

ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ పై ఉన్నత విద్యామండలి కీలక అప్ డేట్ ఇచ్చింది.

Engineering counseling: ఇంజినీరింగ్ విద్యార్థులకు అలర్ట్.. కౌన్సెలింగ్ పై కీలక అప్ డేట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పై ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకృష్ణారెడ్డి (Balakrishna Reddy) కీలక అప్ డేట్ ఇచ్చారు. జులై మొదటి వారంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ (Engineering Counselling) నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 14 లోపు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఆలోపే తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. అనధికార విద్య సంస్థల్లో విద్యార్థులు చేరుతున్నారని అప్రమత్తం చేశారు. నాలుగు విద్యా సంస్థలు అనుమతి లేకుండా నడుపుతున్నారని అలాంటి నాలుగు విద్యా సంస్థలకు లీగల్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. నెక్స్ట్ వేవ్, బైట్ ఎక్స్ ఎల్ టెక్ ఎండ్, లీప్ స్టార్ట్, ఇంటెల్లిపాత్ సంస్థలకు నోటీసులు ఇచ్చామని ఈ నెల 13వ తేదీ వరకు వివరణ కోసం గడువు ఇచ్చినట్లు తెలిపారు. డీమ్డ్ వర్సిటీలతో ఒప్పందం చేసుకున్నట్లు విద్యా సంస్థలు తెలుపుతున్నాయి. ఆ నాలుగు సంస్థలకు లీగల్ నోటీసులు. ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని డీమ్డ్ యూనివర్సిటీల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. బీ కేటగిరి సీట్ల అంశం ఇంకా స్పష్టత రాలేదని ఈ విషయంలో ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. సిలబస్ మార్పుపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. కోర్సుల ఎంపికపై విద్యార్థులకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉన్నత విద్యామండలిలో సంస్కరణలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు.

Next Story