- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG EDCET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పీఈ సెట్, ఎడ్‌సెట్ షెడ్యూల్ విడుదల
ప్రవేశ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రవేశ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. పీఈ సెట్ (PE CET), ఎడ్‌సెట్ (EDCET) షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. మార్చి 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫైన్‌తో సహా మే 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం కల్పించినట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. జూన్ 11 నుంచి 14 వరకు తెలంగాణ పీఈ సెట్ (PE CET) పరీక్షలు జరగనున్నాయి. ఎడ్‌సెట్ (ED CET) నోటిఫికేషన్‌ను కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) విడుదల చేసింది. మార్చి 10న ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వర్సిటీ ప్రకటనలో పేర్కొంది. జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.






