- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG ED CET-2025 దరఖాస్తుల గడువు పొడిగింపు
తెలంగాణ లోని విద్యా కళాశాలల్లో 2025-2026 విద్యాసంవత్సరానికి బి.ఎడ్(రెండు సంవత్సరాలు) రెగ్యులర్ కోర్సులో ప్రవేశానికి సంబంధించిన ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.

X
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ లోని విద్యా కళాశాలల్లో 2025-2026 విద్యాసంవత్సరానికి బి.ఎడ్(రెండు సంవత్సరాలు) రెగ్యులర్ కోర్సులో ప్రవేశానికి సంబంధించిన ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ ఎడ్ సెట్ గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. నేటితో దరఖాస్తు గడువు పూర్తవగా ఆలస్య రుసుము లేకుండా ఈ నెల(మే) 20వ తేదీ వరకు అభ్యర్థుల దరఖాస్తుకు అధికారులు అవకాశం కల్పించారు. అయితే ఈ దరఖాస్తు ఫీజు మొదటగా ఆలస్య రుసుముతో కలిపి ఈ నెల(మే) 24 వరకు అవకాశం ఇచ్చారు. ఇక దరఖాస్తు చేసుకునేందుకు జనరల్ అభ్యర్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.550 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://edcet.tgche.ac.in/ ను సందర్శించండి.
Next Story






