- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీ ఈఏపీసెట్ మాక్ అలాట్మెంట్స్ విడుదల
2025-26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈఏసీసెట్ 2025 పరీక్షలో అర్హత సాధించిన

టీజీ ఈఏపీసెట్ మాక్ అలాట్మెంట్స్ విడుదల
-జులై 13 నుంచి 15 వరకు ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం
-జులై 15న ఆప్షన్ల ఫ్రీజింగ్
-ఎన్సీసీ, స్పోర్ట్స్ కు ప్రత్యేక రిజర్వేషన్ కేటగిరి సీట్లను కేటాయించలేదు
-సాంకేతిక విద్యా, టీజీ ఎప్ సెట్ అడ్మిషన్ల కన్వినర్
దిశ, తెలంగాణ బ్యూరో: 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈఏసీసెట్ 2025 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ కు సంబంధించిన మాక్ అలాట్మెంట్స్ విడుదలయ్యాయి. విద్యార్థులు తమ మాక్ అలాట్మెంట్లను http://tgeapcet.nic.in వెబ్సైట్ లో చూసుకోవచ్చని సాంకేతిక విద్యా, టీజీ ఎప్ సెట్ అడ్మిషన్ల కన్వినర్ దేవసేన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మాక్ అలాట్‌మెంట్ కేవలం అవగాహన కోసం మాత్రమే అని విద్యార్థులు గుర్తించాలని పేర్కొన్నారు. అభ్యర్థులు జులై 13 నుండి 15 వరకు తమ ఆప్షన్లను మార్చుకోవచ్చని, ఈ ఆప్షన్లను మొదటి విడత తాత్కాలిక కేటాయింపుకు పరిగణిస్తారని తెలిపారు. ఒకవేళ అభ్యర్థి మాక్ అలాట్‌మెంట్ కోసం ఇచ్చిన ఆప్షన్లను మార్చకపోతే, మొదటి విడత తాత్కాలిక కేటాయింపుకు అవే ఆప్షన్లను పరిగణిస్తారని పేర్కొన్నారు.
ఆప్షన్లు ఫ్రీజింగ్ జులై 15న అభ్యర్థి లాగిన్‌లో సేవ్ చేసిన ఆప్షన్లను మొదటి విడత తాత్కాలిక కేటాయింపుకు పరిగణిస్తారన్నారు. మాక్ అలాట్‌మెంట్‌లో ఎన్ సీసీ, స్పోర్ట్స్ వంటి వంటి ప్రత్యేక రిజర్వేషన్ కేటగిరీ సీట్లను కేటాయించలేదని తెలిపారు. సంబంధిత విభాగాల నుండి ప్రాధాన్యతలు అందిన తర్వాత తదుపరి విడతల్లో కేటాయింపులు జరుగుతాయన్నారు. మాక్ అలాట్‌మెంట్ అనేది మాక్ రౌండ్‌లో పాల్గొన్న అభ్యర్థులు నమోదు చేసిన ఆప్షన్ల ఆధారంగా రూపొందించినట్లు తెలిపారు. మొదటి విడత సీట్ల కేటాయింపు మాక్ అలాట్‌మెంట్ నుండి మారే అవకాశం ఉందని, ఇది అభ్యర్థులు మొదటి విడతలో (మాక్ అలాట్‌మెంట్ తర్వాత) నమోదు చేసే ఎంపికల ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 1 నుంచి 8 వరకు నిర్వహించారు. జులై 6 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. కాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు 95,256 విద్యార్థులు హాజరయ్యారు. 94,059 విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. 56,63,308 మంది ఆప్షన్లు స్వీకరించారు. మొత్తం 83,054 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 77,154 సీట్లు కేటాయించారు. 5,900 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆప్షన్లు ఇచ్చి కూడా కేటాయింపులు పొందని అభ్యర్థులు 16,905 మంది ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటా కింద 6,021 కేటాయింపులు పొందారు. క్రీడా, ఎన్‌సీసీ కోటా సీట్లను తదుపరి విడత కౌన్సెలింగ్‌లలో కేటాయిస్తారు.






