- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీ ఎప్ సెట్ ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో కోర్సు మార్పు కోసం టీజీ ఎప్ సెట్ 2025 ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. తుది విడత తర్వాత ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరిన విద్యార్థుల కోసం ఈ వెబ్ ఆధారిత సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ నిర్వహించారు.

- ఇంటర్నల్ స్లైడింగ్ కోసం 3,590 మందికి సీట్ల కేటాయింపు
- ఆగస్టు 23 లోగా కొత్తగా కేటాయించిన బ్రాంచ్ లో రిపోర్టుకు అవకాశం
- టీజీ ఎప్ సెట్ అడ్మిషన్ల కన్వీనర్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో కోర్సు మార్పు కోసం టీజీ ఎప్ సెట్ 2025 ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. తుది విడత తర్వాత ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరిన విద్యార్థుల కోసం ఈ వెబ్ ఆధారిత సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ నిర్వహించారు. ఆగస్టు 18 నుంచి 19 వరకు విద్యార్థులు తమ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా మొత్తం 3,590 సీట్లు కేటాయింపు జరిగినట్లు టీజీ ఎప్ సెట్ అడ్మిషన్ల కన్వినర్ ఒక ప్రకటనలో తెలిపారు. 97,369 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరయ్యారు. వీరిలో ఇంటర్నల్ స్లైడింగ్ కోసం 9,419 మంది అభ్యర్థులు తమ ఆప్షన్లను నమోదు చేసుకున్నారు. వారికి మొత్తం 26,122 ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 13,453 సీట్లు ఇంటర్నల్ స్లైడింగ్ కోసం అందుబాటులో ఉండగా, వీటిలో 3,590 సీట్లు అభ్యర్థులకు కేటాయించారు. అయితే, ఇంకా 9,863 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా కొత్త బ్రాంచ్ పొందిన విద్యార్థులు మరోసారి కొత్త అలాట్మెంట్ ఆర్డర్‌ను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు కొత్తగా కేటాయించిన బ్రాంచ్‌లో ఆగస్టు 23 లోగా రిపోర్ట్ చేయాలి. పూర్తి వివరాలు https://tgeapcet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.






