- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: రాష్ట్రంలో మొదలైన కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణలో అర్హులైన జర్నలిస్టులందరికీ 15 రోజుల్లో అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జర్నలిస్టులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ మొదలైంది. ఇవాళ హైదరాబాద్ హిమాయత్ నగర్‌ని స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని ఇందులో ప్రభుత్వానికి రెండో ఆలోచన లేదని చెప్పారు. అక్రిడిటేషన్ కార్డులు జారీ అయ్యాక ఎవరైనా సంస్థ మారితే ఆ సమాచంర అధికారులకు తెలియజేస్తే అలాంటి వారి అక్రిడిటేషన్ కార్డులు తొలగించబోమన్నారు.
15 రోజుల్లో అందరికి..
దేశంలో అత్యుత్తమ విధానాలతో అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇంతకాలం ఆలస్యం జరిగిందని మంత్రి చెప్పారు. సుమారు 45-46 వేల మంది అర్హత కలిగి ఉండేలా తమ ప్రమభుత్వం ఇచ్చిన జీవోలు ఉండేవని ఇదే గత ప్రభుత్వంలో 32 వేల మంది నుంచి 35 వేల మంది మాత్రమే ఉండేదన్నారు. గతంలో పొడిగించిన అక్రిడిటేషన్ల గడువు ఇవాళ్టితో ముగిసిందని కొత్త కార్డులు ఇస్తామన్నారు. ఇప్పటికే స్టేట్ కార్డుల్లో 2500 మందికి క్లియర్ చేశామని జిల్లా స్థాయిలో అర్హత కలిగిన జర్నలిస్టులకు కార్డులు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నానన్నారు. 15 రోజుల్లో అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. కొత్త దరఖాస్తులకు డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దాంతో కొత్తగా ఎన్ని కార్డులు మంజూరు చేశామో సంఖ్య తెలిస్తే దాని ఆధారంగా జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.






