- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG BJP: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మాకు ఓ ఛాలెంజ్.. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నిక తమకు ఓ ఛాలెంజ్ లాంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (N Ramchander Rao) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నిక తమకు ఓ ఛాలెంజ్ లాంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (N Ramchander Rao) అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తమకు ఓ ఛాలెంజ్ అని అన్నారు. పోయిన ఎన్నికలకు ప్రస్తుతం జరగబోయే ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉందని.. అప్పడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న సమీకరణలు వేరని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ పాలన పట్ల ప్రజలకు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో వారు గెలుపొందడం అంత ఆశామాషీ విషయం కాదన్నారు. తొలిసారిగా తాము త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నామని అన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో జరగబోయే ప్రతి ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటామని.. త్వరలో బీజేపీ కొత్త వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీలో ఎలాంటి గ్రూపులు లేకుండా చేస్తానని రాంచందర్ రావు అన్నారు.






