- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీం తీర్పు మంచి పరిణామం : రామచందర్ రావు
పార్టీ ఫిరాయించిన తెలంగాణకు 10 ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు(Suprem Court) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : పార్టీ ఫిరాయించిన తెలంగాణకు 10 ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు(Suprem Court) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంతీర్పుపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(Ramachandar Rao) స్పందించారు. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు నివ్వడం రాజకీయాల్లో మంచి పరిణామం అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ రెండు ఫిరాయింపులను ప్రోత్సహించిన పార్టీలేనని ఆయన మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్రపై తీవ్ర విమర్శలు చేసారు.
అది జనహిత పాదయాత్రనో? జనాలను మోసం చేసే పాదయాత్రనో వారికే తెలియాలి అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలు, అన్ని డిక్లరేషన్లు.. ఇలా ఎన్ని హామీలు నెరవేర్చిందో శ్వేతపత్రం విడుదల చేసి అప్పుడు పాదయాత్రలు చేయాలని డిమాండ్ చేసారు. శ్వేతపత్రం విడుదల చేయకుండా ప్రజల్లో తిరిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు.






